పవన్ తో రానా ఢీ.. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్..!

మళయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుం కోషియం రీమేక్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి చేస్తున్నారని తెలిసిందే. పవన్ ఈ సినిమాను కన్ ఫాం చేయగా సెకండ్ హీరోగా రానా అన్నది లీక్ న్యూస్ మాత్రమే కాని అఫీషియల్ గా చెప్పలేదు. అయితే ఫైనల్ గా ఈ సినిమాలో రానా నటిస్తున్నాడన్న విషయాన్ని కూడా ఎనౌన్స్ చేశారు చిత్రయూనిట్. 

పవర్ స్టార్, రానా ఢీ అంటే ఢీ అనేలా ఇద్దరి మధ్య ఫైట్ ఉండబోతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ఇద్దరు తమ ఈగోలతో ఫైట్ చేయబోతున్నారు. పవన్, రానా ఇద్దరు కలిసి చేయబోతున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మళయాళ వర్షన్ లో సాంగ్స్ ఏమి లేవు కాని తెలుగులో మాత్రం ఈ సినిమాకు సాంగ్స్ తో పాటుగా కమర్షియల్ అంశాలు యాడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.