సంక్రాంతికే క్రాక్..!

మాస్ మహరాజ్ రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న సినిమా క్రాక్. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించనున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. డైరక్టర్ గోపీచంద్, హీరో రవితేజ ఇద్దరు కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఉంది. అందుకే క్రాక్ మీద ఫుల్ ఫోకస్ పెట్టారు.

సినిమా ట్రైలర్ త్వరలో రాబోతుందని తెలుస్తుండగా సినిమా రిలీజ్ పై మరోసారి క్లారిటీ వచ్చింది. సినిమాను 2021 సంక్రాంతికి రిలీజ్ చేయడం పక్కా అని తెలుస్తుంది. చిత్రయూనిట్ నుండి అఫీషియల్ న్యూస్ రావడంతో రవితేజ ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు. అసలైతే సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసినా వాటిలో రవితేజ క్రాక్ మాత్రం పక్కా రిలీజ్ అని తెలుస్తుంది. రాజా ది గ్రేట్ తర్వాత హిట్టు కోసం ప్రయత్నిస్తున్న రవితేజకు క్రాక్ హిట్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.