
ఈమధ్య కమెడియన్స్ కూడా సోలో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. స్వామిరారా సినిమాతో సత్తా చాటిన సత్య కమెడియన్ గా అలరిస్తున్నాడు. ఇక అతను లీడ్ రోల్ లో యువ హీరో సందీప్ కిషన్ నిర్మతగా వస్తున్న సినిమా వివాహ భోజనంబు. రాం అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
రూపాయ్ ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోయినంతగా ఫీల్ అయ్యే ఓ వ్యక్తి.. కరోనా లాక్ డౌన్ టైం లో పెళ్లి.. ఆ తర్వాత అతని ఇంట్లో ఉన్న బంధువులను వధిలించుకునే ప్రయత్నం.. సినిమా అంతా ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. సత్య సరసన ఆర్జవీ ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది. సినిమాలో సందీప్ కిష ఓ గెస్ట్ రోల్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. యువ హీరోగా ఓ పక్క తన సినిమాలు చేస్తూనే నిర్మాతగా మరొకరికి ఛాన్స్ ఇస్తున్నాడు సందీప్ కిషన్. మరి సందీప్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.