పవన్.. సురేందర్ రెడ్డి.. పొలిటికల్ టచ్..!

అజ్ఞాతవాసి తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సెట్స్ మీద ఉన్న వకీల్ సాబ్ త్వరలో పూర్తి చేసి ఆ తర్వాత క్రిష్ సినిమా షూటింగ్ చేయనున్నాడట. ఇక హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు లైన్ లోనే ఉన్నాయి. ఇవి కాకుండా అయ్యప్పనుం కోషియం రీమేక్ సాగర్ చంద్ర డైరక్షన్ లో ఫిక్స్ చేసుకున్నాడు. ఆ సినిమాకు కూడా పవర్ స్టార్ డేట్స్ అడ్జెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.

మిగతా సినిమాల కథలు ఏమో కాని సురేందర్ రెడ్డి సినిమాలో పవర్ స్టార్ రీల్ లైఫ్ పొలిటీషియన్ గా కూడా కనిపిస్తాడని తెలుస్తుంది. సినిమాలో పవర్ స్టార్ లీడర్ గా చూపిస్తాడట సురేందర్ రెడ్డి. నాయకుడిగా పవన్ ఇమేజ్ పెంచేలా ఈ సినిమా సపోర్ట్ చేస్తుందని అంటున్నారు. ధృవ, సైరా సినిమాల తర్వాత స్టార్ ఛాన్సులు వస్తాయనుకున్న సురేందర్ రెడ్డి తన నెక్స్ట్ సినిమా అఖిల్ తో ప్లాన్ చేసుకున్నాడు. అఖిల్ సినిమా తర్వాత పవన్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. పవర్ స్టార్ తో మాస్ డైరక్టర్ సురేందర్ రెడ్డి కమర్షియల్ ఎంటర్టైనర్ వస్తుందని అనుకున్నారు కాని పొలిటికల్ టచ్ ఉన్న కథతో వీరి సినిమా వస్తుందని అంటున్నారు. మరి ఆ డీటైల్స్ ఏంటన్నది అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తేనే తెలుస్తుంది.