బాలకృష్ణతో గోపీచంద్..?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతవరకు టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమా గురించి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బి.గోపాల్ తో బాలయ్య సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇదేకాకుండా సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో కూడా బాలకృష్ణ సినిమా ఫైనల్ అయ్యిందని అంటున్నారు. 

వీటితో పాటుగా రవితేజ క్రాక్ డైరక్టర్ గోపీచంద్ మలినేని డైరక్షన్ లో కూడా బాలయ్య బాబు సినిమా ఉంటుందని టాక్. ఆల్రెడీ గోపీచంద్ మలినేని బాలకృష్ణని కలిసి కథా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. రవితేజ క్రాక్ తర్వాత గోపీచంద్ బాలకృష్ణతోనే సినిమా చేస్తాడని అంటున్నారు. మరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబో సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. యువ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా బాలకృష్ణ సినిమాలు చేస్తున్నారు.