విజయ్ 'మాస్టర్' టీజర్..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, ఖైది సినిమాతో సెన్సేషనల్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మాస్టర్. తమిళంతో పాటు తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా తెలుగు వర్షన్ టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు. ఓ స్టార్ హీరో సినిమాకు ఉండాల్సిన అన్ని కమర్షియల్ అంశాలతో ఈ సినిమా వస్తుందని చెప్పొచ్చు. సినిమాలో విజయ్ లుక్, స్టైల్ అదిరిపోయాయి.

సినిమాలో విజయ్ కు విలన్ గా మరో విజయ్ అదేనండి విజయ్ సేతుపతి నటించారు. హీరో ఒకరు.. విలన్ ఒకరు విజయ్ స్క్వేర్ మాస్టర్ సినిమాలో తమ సత్తా ఏంటో చూపించారని తెలుస్తుంది. మాస్టర్ తమిళ టీజర్ అంతకుముందే రిలీజ్ కాగా తెలుగు టీజర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా విజయ్ తెలుగు ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసేలా మాస్టర్ టీజర్ ఉందని చెప్పొచు. ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.