
నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా టక్ జగదీష్. షైన్ స్క్రీన్ బ్యానర్ లో హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది.
చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతున్నట్టు తెలుస్తుంది. బడా నిర్మాత ఒకరు టక్ జగదీష్ సినిమాను 47 కోట్లకు డీల్ సెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. కేవలం థియేట్రికల్ రైట్స్ 47 కోట్లు కాగా ఇంకా డిజిటల్, శాటిలైట్ రైట్స్ లో ఇంకాస్త బిజినెస్ చేసేలా ఉంది. మొత్తానికి నాని వి సినిమా అంచనాలను అందుకోలేకపోయినా సరే టక్ జగదీష్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొట్టేస్తుంది. మరి ఈ సినిమా బిజినెస్ తగినట్టుగా సినిమా సత్తా చాటుతుందేమో చూడాలి.