
మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమాకు డైరక్టర్ ఫిక్స్ అయ్యారు. మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నట్టు తెలుస్తుంది. కోలీవుడ్ రీమేక్ స్పెషలిస్ట్ అయిన మోహన్ రాజా లూసిఫర్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ముందు సుజిత్.. ఆ తర్వాత వినాయక్ డైరెక్ట్ చేస్తారనుకున్న ఈ రీమేక్ ఫైనల్ గా మోహన్ రాజా చేతుల్లోకి వెళ్లింది.
ఈ సినిమాను తిరుపతి ప్రసాద్, రాం చరణ్ కలిసి నిర్మిస్తారని తెలుస్తుంది. 2021 సంక్రాంతికి ఈ సినిమా ముహుర్త కార్యక్రమాలు జరుగనున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేయడం మెగా ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.
#MegaStar153 #Lucifer movie Telugu remake will be directed by @Jayam_Mohanraja and jointly produced by @KonidelaPro & NVR Cinema.
#MegaStar @KChiruTweets will join the sets after Sankranthi 2021. pic.twitter.com/r5t0ZiuWo9