అఖిల్ 5.. సంక్రాంతికి స్టార్ట్..!

అక్కినేని వారసుడు అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు. 2021 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేసినట్టు తెలిసిందే. సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్దే నటించింది. టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న పూజా హెగ్దే అఖిల్ బ్యాచ్ లర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఐదవ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. బోర్న్ ఐడెంటిటీ సినిమా స్పూర్తితో ఈ సినిమా కథ ఉంటుందని టాక్. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 2021 సంక్రాంతి రోజున ముహుర్తం పెడతారని తెలుస్తుంది. సంక్రాంతికి పూజా చేసి ఇయర్ ఎండింగ్ కల్లా సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి అఖిల్ హిట్టు కోసం పర్ఫెక్ట్ ప్లాన్ సెట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది.