F3లో మరో హీరో..?

ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ F2తో సూపర్ హిట్ అందుకున్న అనీల్ రావిపుడి ఆ సినిమా సీక్వల్ ను త్వరలో మొదలు పెట్టబోతున్నారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న F3 సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా ఉంటాడని టాక్. అప్పట్లోనే F3లో మాస్ మహరాజ్ రవితేజ నటిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే వాటిపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు.

లేటెస్ట్ గా ఎఫ్3 సినిమాలో ఓ హీరో గెస్ట్ రోల్ ఉంటుందని అంటున్నారు. రవితేజ, గోపీచంద్ ఇద్దరిలో ఎవరో ఒకరు సినిమాలో కనిపిస్తారని అంటున్నారు. ఫన్, ఫ్రస్ట్రేషన్ అండ్ మోర్ ఫన్ అంటూ F3తో వెంకటేష్, వరుణ్ తేజ్ ల బ్రొమాన్స్ తో మరో సూపర్ హిట్ అందుకోవాలని ఫిక్స్ అయ్యాడు అనీల్ రావిపుడి. మరి ఈ సినిమాలో మూడవ హీరో ఉంటాడా.. ఆ గెస్ట్ రోల్ చేసే హీరో ఎవరన్న విషయాలు త్వరలో తెలుస్తాయి.