విజయ్ దేవరకొండ 'జవాన్'..?

పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమాను సుకుమార్ తో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అసలు అంతకుముందు ఎలాంటి డిస్కషన్స్ కూడా జరిగినట్టు వార్తలు రాలేదు కాని సడెన్ గా సుకుమార్, విజయ్ దేవరకొండ సినిమా అంటూ ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం సుకుమార్ పుష్ప సినిమా షూటింగ్ లో ఉన్నాడు. 2021 సెకండ్ హాఫ్ లో పుష్ప రిలీజ్ అవుతుంది. ఆ తర్వాతే విజయ్ దేవరకొండ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. 

సుకుమార్ సినిమాలో విజయ్ దేవరకొండ క్యారక్టర్ గురించి లీకులు వస్తున్నాయి. సినిమాలో విజయ్ జవాన్ గా కనిపిస్తాడని అంటున్నారు. సినిమా కథ బోర్డర్ లో ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. సుకుమార్ స్కెచ్ వేశాడు అంటే దాని రేంజ్ వేరేలా ఉంటుంది. పుష్పతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్న సుక్కు విజయ్ దేవరకొండతో కూడా నేషనల్ వైడ్ సత్తా చాటాలని ఫిక్స్ అయినట్టు ఉన్నాడు.