
ఆరెక్స్ 100 సినిమాతో టాలెంట్ ప్రూవ్ చేసుకున్న డైరక్టర్ అజయ్ భూపతి తన నెక్స్ట్ సినిమా మహా సముద్రం అంటూ రాబోతున్నాడు. రవితేజ, నితిన్, రామ్, నాగ చైతన్య ఇంతమంది హీరోలకు కథ వినిపించి కొందరు ఓకే చేసి చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో అజయ్ భూపతి ఈ సినిమాను చాలా ప్రెస్టిజియస్ గా తీసుకున్నాడు. శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీగా మహా సముద్రం సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.
ఈ సిన్మాలో హీరోయిన్స్ గా అదితి రావు హైదరి, ప్రియాంకా అరుల్ మోహన్ లను సెలెక్ట్ చేశారు. అయితే ఈ ఇద్దరు సరిపోరు అన్నట్టుగా ఆరెక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ను కూడా దించుతున్నాడు అజయ్ భూపతి. మహా సముద్రంలో పాయల్ స్పెషల్ సాంగ్ ఉంటుందని టాక్. తనకు తెలుగులో స్టార్ డం వచ్చేలా చేసిన డైరక్టర్ అడిగితే పాయల్ ఎలా కాదంటుంది చెప్పండి. అందుకే ఆమె స్పెషల్ పర్ఫార్మెన్స్ తో సందడి చేయనుంది. తప్పకుండా పాయల్ స్పెషల్ సాంగ్ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.
జాను సినిమా తర్వాత శ్రీకారం సినిమా చేస్తున్న శర్వానంద్ త్వరలో ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నువ్వస్తానంటే నేనొద్దంటా, బొమ్మరిల్లు సినిమాలతో తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ చాలా గ్యాప్ తర్వాత డైరెక్ట్ తెలుగులో చేస్తున్న సినిమా మహా సముద్రం. ఈ సినిమాపై సిద్ధార్థ్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాడు.