
కరోనా ప్రభావంతో ఈ ఇయర్ సినిమాల సందడి చాలా తక్కువ అని చెప్పొచ్చు. 2021 సంక్రాంతి నుండి మళ్లీ సినీ లవర్స్ కు జోష్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. 2020 ముగుస్తున్న టైం లో ఈ ఇయర్ ట్విట్టర్ లో ట్రెండ్ అయిన సినిమాల గురించి ప్రకటించారు. ఈ ఇయర్ ట్విట్టర్ లో ఎక్కువగా ట్రెండ్ అయిన సినిమా విజయ్ మాస్టర్. ఖైది ఫేమ్ లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను అలరించగా కరోనా వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడ్డది. విజయ్ మాస్టర్ 2020 ట్విట్టర్ ట్రెండింగ్ లో టాప్ 1గా నిలిచింది.
ఇక ఈ ట్రెండింగ్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచిన సినిమా వకీల్ సాబ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరాం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కూడా ట్విట్టర్ ట్రెండింగ్ లో ఉంది. ఇక మూడవ స్థానంలో అజిత్ వలిమై సినిమా ఉంది. వినోద్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ట్విట్టర్ ట్రెండింగ్ లో టాప్ 3లో ఉంది. ఇక ఇదే లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమా కూడా నాల్గవ స్థానంలో ఉంది. మహేష్, పరశురాం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడ ట్రెండింగ్ లో ఉంది.
2020 ట్విట్టర్ ట్రెండింగ్ లో ఐదవ స్థానంలో నిలిచిన సినిమా సూరరైపోట్రు అదే సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా సినిమా. ఇక రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా ఆరవ స్థానంలో ఉండగా.. అల్లు అర్జున్ పుష్ప 7వ స్థానంలో నిలిచింది. 2020 ట్విట్టర్ ట్రెండింగ్ టాప్ 10లో ఎనిమిదవ స్థానంలో నిలిచిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఇక ఇదే లిస్ట్ లో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 తొమ్మిదవ స్థానంలో ఉండగా.. సూపర్ స్టార్ రజినికాంత్ దర్బార్ 10వ స్థానంలో ఉంది.