వైకుంఠపురములో అక్కడ సూపర్ హిట్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని మరి చేసిన సినిమా అల వైకుంఠపురములో. త్రివిక్రం డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు నిర్మించారు. గీతా ఆర్ట్స్ కూడా నిర్మాణ సహకారాన్ని అందించింది. సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది. ఆల్రెడీ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన దువ్వాడ జగన్నాథం హిట్ అవగా ఆ కాంబో రిపీట్ చేసి మరో సూపర్ హిట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

అల వైకుంఠపురములో కేవలం తెలుగులోనే కాదు తమిళంలో కూడా సూపర్ హిట్ అయ్యింది. సినిమా తమిళ వర్షన్ సన్ నెక్స్ట్ లో రిలీజ్ చేయగా సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లభించిందని తెలుస్తుంది. సన్ నెక్స్ట్ లో వైకుంఠపురములో సూపర్ వ్యూస్ సాధించినట్టు తెలుస్తుంది. కోలీవుడ్ ఆడియెన్స్ ను కూడా బన్నీ మెప్పించాడని చెప్పొచ్చు. ఆల్రెడీ అల్లు అర్జున్ కు కేరళలో సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇప్పుడు వైకుంఠపురములో సినిమాతో కోలీవుడ్ లో కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, మళయాళ భాషల్లో క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో టార్గెట్ భారీగానే ఫిక్స్ చేసుకున్నట్టే అనిపిస్తుంది.