2021 రెండు సినిమాలు రిలీజ్ ప్లాన్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 2021 భారీ ప్లానింగ్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ రాధే శ్యామ్ నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం చ్వీరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ఫినిష్ చేస్తారని తెలుస్తుంది. ఇక జనవరి నుండి ఆదిపురుష్ సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్. ఇదే కాకుండా ప్రశాంత్ నీల్ సలార్ సినిమా కూడా సమ్మర్ లో షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తుంది. 

కె.జి.ఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ పూర్తి కాగానే కొద్దిపాటి గ్యాప్ తోనే ప్రభాస్ తో సలార్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్. అయితే ఈ సినిమాను కేవలం మూడు నెలల్లో పూర్తి చేసి అక్టోబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. అంటే సమ్మర్ లో రాధే శ్యామ్, దసరాకి సలార్ వచ్చే ఏడాది రెండు సినిమాలతో ప్రభాస్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అదే జరిగితే 2021 ప్రభాస్ సినిమాలతో బాక్సాఫీస్ పై సత్తా చాటుతాడని చెప్పొచ్చు.