ఫుల్ టైం నిర్మాతగా మహేష్.. ఏజెంట్ ఆత్రేయ హీరోకి ఛాన్స్..!

సూపర్ స్టార్ మహేష్ ఫుల్ టైం నిర్మాతగా మారుతున్నాడని చెప్పొచ్చు. ఇన్నాళ్లు తన సినిమాలకు సమర్పకుడిగా ఉన్న  మహేష్ తన ప్రొడక్షన్ లో మొదటి సినిమా అడివి శేష్ హీరోగా మేజర్ మొదలుపెట్టాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అవకముందే మహేష్ నిర్మాతగా మరో సినిమా ప్లాన్ చేస్తున్నారట. నూతన దర్శకుడు వీర శంకర్ కథకు ఇంప్రెస్ అయిన మహేష్ సినిమా నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ హీరో నవీన్ పొలిశెట్టి నటిస్తాడని తెలుస్తుంది. ఏజెంట్ ఆత్రేయ సినిమాతో నటుడిగా తన టాలెంట్ చూపించిన నవీన్ ఆల్రెడీ స్వప్న సినిమాస్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఇది కాకుండా మహేష్ నిర్మాతగా మరో సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. చూస్తుంటే మహేష్ ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.