
బాహుబలి తర్వాత ప్రభాస్ తో సినిమా అంటే ఎవరు కాదంటారు చెప్పండి అయితే అలాంటి ఛాన్స్ రావాలని కోరుకునే వారి లిస్ట్ లో కమల్ గారాలపట్టి శృతి హాసన్ చేరింది. ప్రభాస్ తో నటించేందుకు తాను రెడీ అంటుంది. అంతేకాదు సినిమాకు రెమ్యునరేషన్ కూడా తగ్గించుకుంటా అని అంటుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అందుకే ప్రభాస్ తో సినిమా చేస్తే డబుల్ క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం ప్రభాస్ కేవలం పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. అందుకే శృతి హాసన్ ప్రభాస్ మీద కన్నేసింది. ప్రభాస్ రాధే శ్యామ్ పూజా హెగ్దే, ఆదిపురుష్ లో బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకునే ఛాన్స్ ఉంది. నాగ్ అశ్విన్ సినిమాలో ఆల్రెడీ దీపికని తీసుకున్నారు. ప్రస్తుతం కమిటైన సినిమాల వరకైతే ప్రభాస్ శృతి హాసన్ కాంబోకి ఛాన్స్ లేనట్టే. మరి ఫ్యూచర్ లో అయినా ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి.