
కె.జి.ఎఫ్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం చాప్టర్ 2 చేస్తున్నాడు కె.జి.ఎఫ్ సూపర్ హిట్ అవడంతో చాప్టర్ 2కి రెట్టింపు క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ స్టార్స్ కూడా కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సినిమాలో నటిస్తున్నారు. 2021 సమ్మర్ తో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాను కె.జి.ఎఫ్ నిర్మాతలే నిర్మించడం విశేషం. వచ్చే ఏడాది స్టార్ట్ అవనున్న ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ రావాల్సి ఉంది.
ప్రభాస్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్.టి.ఆర్ సినిమా చేస్తాడని అనుకొగా ఎన్.టి.ఆర్ కన్నా ముందు మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కె.జి.ఎఫ్ సినిమాని చూసిన చిరు ఇంప్రెస్ అవడంతో చరణ్ తో ప్రశాంత్ నీల్ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్ సలార్ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ సినిమా ఉంటుందని అనుకుంటుండగా సడెన్ గా చరణ్ లైన్ లోకి వచ్చినట్టు టాక్. మరి ప్రశాంత్ నీల్ ఎవరితో సినిమా చేస్తాడన్నది చూడాలి.