
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న సినిమా పుష్ప. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మారేడుమిల్లిలో జరిగింది. అయితే మారేడుమిల్లిలో షూటింగ్ సెటప్ అంతా బాగున్నా చిత్రయూనిట్ లో కరోనా రావడం యూనిట్ ను హైదరాబాద్ కు షిఫ్ట్ చేశాడట సుకుమార్. ఫిల్మ్ నగర్ టాక్ ఏంటంటే సుకుమార్ కూడా హోం ఐసోలేషన్ లో ఉన్నాడని అంటున్నారు.
ఇదిలాఉంటే అల్లు అర్జున్, సుకుమార్ చర్చల అనంతరం హైదరాబాద్ కే అడివిని తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. అదేంటి హైదరాబాద్ కు అడివి ఎలా వస్తుంది అంటే.. ఫిల్మ్ సిటీలోనే ఫారెస్ట్ సెటప్ వేయాలని ప్లాన్ చేశారట. అవుట్ డోర్ షూట్ అది ఫారెస్ట్ లో అన్ని రోజులు అంటే కష్టమని భావిస్తున్నారు చిత్రయూనిట్. అందుకే ఫారెస్ట్ సెట్ ను ఫిల్మ్ సిటీలో వేయాలని అనుకుంటున్నారట. అదే జరిగితే హైదరాబాద్ ఫిల్మ్ సిటీలో దట్టమైన అడివి వచ్చేసినట్టే. అనుకున్నంత ఈజీ కాదు ఫారెస్ట్ సెట్ వేయడం.. సినిమాకు అతి ముఖ్యమైన ఫారెస్ట్ సెటప్ ను ఇలా సెట్ ద్వారా ఎంతవరకు పర్ఫెక్ట్ గా తీయగలరు అన్నది చూడాలి. మరి హైదరాబాద్ ఫిల్మ్ సిటీలోనే పుష్ప కోసం ఫారెస్ట్ సెట్ వేస్తున్నారన్న వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.