
శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో సూపర్ హిట్ మూవీ ఇండియన్ కు ఈక్వల్ గా ఇండియన్ 2 మూవీ లాస్ట్ ఇయర్ ఎనౌన్స్ చేశారు. షూటింగ్ కూడా మొదలుపెట్టిన ఈ సినిమా క్రేన్ యాక్సిడెంట్ వల్ల షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత నిర్మాతతో బడ్జెట్ సమస్యలు తలెత్తడంతో దాదాపు ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని వార్తలు వచ్చాయి.
లేటెస్ట్ గా మళ్లీ ఈ సినిమాను తిరిగి సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. లైకా ప్రొడక్షన్స్ లో చర్చలు సఫలం కావడంతో శంకర్ త్వరలో తిరిగి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నారట. భారతీయుడు సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా సీక్వల్ గా వస్తున్న భారతీయుడు 2 కూడా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐ తో వెనకపడ్డ శంకర్ రోబో 2 పర్వాలేదు అనిపించుకున్నాడు ఇండియన్ 2తో తన మార్క్ హిట్ కొట్టాలని చూస్తున్నారు.