
తెలుగు ఓటిటి యాప్ ఆహా కోసం సమంత స్పెషల్ గా చేస్తున్న టాక్ షో సాం జాం. స్టార్ హీరోయిన్ గా సూపర్ ఫాం లో ఉన్న సాం డిజిటల్ మీడియాలో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సీరీస్ లో నటించిన సమంత సామ్ జామ్ కోసం స్టార్స్ ను ఇంటర్వ్యూస్ చేస్తుంది. లేటెస్ట్ గా సమంత మరో స్టార్ హీరోయిన్ తమన్నాతో చిట్ చాట్ చేసినట్టు తెలుస్తుంది. సామ్ జామ్ స్పెషల్ గా సెలబ్రిటీస్ పర్సనల్, ప్రొఫెషనల్ విషయాల గురించి ఈ టాక్ షో నడుస్తుంది.
స్పెషల్ గెస్ట్ గా వచ్చిన తమన్నా సమంత అడిగిన ప్రశ్నలన్నిటికి చాలా క్లవర్ గా సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సమంత సామ్ జామ్ టాక్ షో విత్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రోమో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఒకే వేదిక మీద జరిపిన ఈ స్పెషల్ చిట్ చాట్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని చెప్పొచ్చు.