హిట్ డైరక్టర్ తో ఎన్టీఆర్..?

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం చేస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత తన నెక్స్ట్ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరక్షన్ లో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కల్యాణ్ రాం కూడా నిర్మాతగా వ్యవహరిస్తాడని తెలుస్తుంది. 

త్రివిక్రం సినిమా తర్వాత తారక్ యువ దర్శకుడు శైలేష్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. హిట్ సినిమాతో హిట్ అందుకున్న డైరక్టర్ శైలేష్ ఎన్.టి.ఆర్ కు సరిపడే కథ రాసుకున్నాడట. దిల్ రాజు సహాయంతో ఎన్.టి.ఆర్ ను కలిసి డైరక్టర్ లైన్ వినిపించాడట. ఎన్.టి.ఆర్ కు ఆ కథ నచ్చినట్టు టాక్. ఒక సినిమా అనుభవం ఉన్న డైరక్టర్ కు తారక్ ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.