సత్యదేవ్ తిమ్మరుసు టీజర్ రిలీజ్..!

లాక్ డౌన్ టైంలో స్టార్ హీరోలు కూడా వెనకపడగా యువ హీరో సత్య దేవ్ మాత్రం తన సత్తా చాటాడు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సత్య దేవ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తమన్నా ఫీమేల్ లీడ్ గా గుర్తుందా శీతాకాలం సినిమా చేస్తున్న సత్య దేవ్ ఆ సినిమాతో పాటుగా తిమ్మరుసు సినిమా చేస్తున్నాడు. ఓ సిన్సియర్ లాయర్ కథతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.  

న్యాయం మాత్రం గెలవడం నాకు ఇంపార్టెంట్ సార్ అంటూ సత్య దేవ్ చెప్పిన డైలాగ్ చూసే ఈ సినిమా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. సత్య దేవ్ లాయర్ పాత్రలో కనిపిస్తున్నాడు. డిఫరెంట్ స్టోరీస్.. డిఫరెంట్ క్యారక్టరైజేషన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సత్య దేవ్. శరణ్ కొప్పిశెట్టి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ లో మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన టీజర్ ను పూరీ జగన్నాథ్ రిలీజ్ చేశారు.