
మెగా డాటర్ నిహారిక జొన్నలగడ్డ చైతన్య పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో మెగా ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఈ వేడుకని దగ్గర ఉండి జరిపించారు.
నిహారికకు 2 కోట్ల విలువైన జెవెలరీ పెళ్లి కానుకగా ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక చైతన్య, నిహారికల పెళ్లిలో సందడి అంతా మెగా హీరోలదే అని తెలుస్తుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాం చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్ ఇలా మెగా హీరోలంతా ఒక చోట కలిసి సందడి చేయడం ఈమధ్య కాలంలో ఇదే మొదటిసారని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ తో పాటుగా అకిరా నందన్, ఆద్యలు కూడా ఈ పెళ్లి వేడుకకు వచ్చినట్టు తెలుస్తుంది.