
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో శ్యాం సింగ రాయ్ సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమాలో నాని డ్యుయల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా నాని సినిమాల్లో స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు. టాక్సీవాలాతో ప్రతిభ చాటిన రాహుల్ కొత్త కథతో శ్యాం సింగ రాయ్ చేస్తున్నాడట.
ఈ సినిమా బడ్జెట్ విషయంలో డైరక్టర్, నిర్మాతల మధ్య గొడవలు అవుతున్నాయని.. అందుకనే నాని ఈ సినిమాను పక్కన పెట్టేశాడని వార్తలు వచ్చాయి. కాని నాని శ్యాం సింగ రాయ్ సినిమాకు గురువారం ముహుర్తం ఫిక్స్ చేశారు. డిసెంబర్ 10న పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా యూనిట్.. సినిమాపై వస్తున్న రూమర్స్ అన్నిటికి చెక్ పెట్టేసిందని చెప్పొచ్చు.