
మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం సినిమాను తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి చేస్తున్నారని తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ లో తెరకెక్కుతున్న ఈ సూపర్ హిట్ రీమేక్ ను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తునారు.
మళయాళ వర్షన్ లో అసలు సాంగ్స్ లేవు.. కాని తెలుగు వర్షన్ లో సాంగ్స్ పెడుతున్నారట. ఇప్పటికే ఈ రీమేక్ కోసం థమన్ ట్యూన్స్ రెడీ చేసినట్టు తెలుస్తుంది. చెన్నైలో అయ్యప్పనుం కోషియం సినిమా సాంగ్స్ రికార్డింగ్ జరుగుతుందని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్స్ మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఈ రీమేక్ కు పవన్ కేవలం 25 రోజుల డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. 2021 మొదట్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని టాక్.