F3లో మూడో F అంటే..!

ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ ఎఫ్-2తో సూపర్ హిట్ కొట్టాడు అనీల్ రావిపుడి. ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ కు ఒకప్పటి వెంకటేష్ ను మళ్ళీ గుర్తుచేసి సూపర్ అనిపించుకున్నాడు. ఇక ఆ తర్వాత అనీల్ రావిపుడి సూపర్ స్టార్ మహేష్ తో కూడా సినిమా చేసి హిట్ అందుకున్నాడు. అనీల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎఫ్-3 స్ని తెలిసిందే. మరోసారి కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాలని ఫిక్స్ అయ్యాడు.

ఎఫ్-2లో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అని చెప్పిన అనీల్ రావిపుడి ఎఫ్-3 అంటే మూడవ ఎఫ్ అంటే ఫ్యామిలీ అని అంటున్నాడు. ఫన్, ఫ్రస్ట్రేషన్, ఫ్యామిలీ ఇలా ఎఫ్-3తో సర్ ప్రైజ్ చేయనున్నాడు అనీల్ రావిపుడి. 2021 జనవరిలో మొదలు కానున్న ఈ సినిమా 2022 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీగా సంక్రాంతికి సందడి చేసిన ఎఫ్-2 అదే మ్యాజిక్ ఎఫ్-3తో కూడా రిపీట్ అయ్యేలా చేస్తుందో లేదో చూడాలి.