
సూపర్ స్టార్ మహేష్ 45 ఏళ్ల వయసులో కూడా టీనేజ్ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. 2005లో వచ్చిన పోకిరి సినిమాలో ఎలా ఉన్నాడో ఈ ఇయర్ వచ్చిన సరిలేరు నీకెవ్వరులో కూడా అలానే యంగ్ గా కనిపించాడు. అందానికి కేరాఫ్ అడ్రెస్ అనిపించేలా ఉన్న మహేష్ తన అందంతో పాటు తన నటనతో కూడా ఫ్యాన్స్ ను అలరిస్తుంటాడు. లేటెస్ట్ గా మహేష్ బాబు స్టైలిష్ న్యూ లుక్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది.
ఓ యాడ్ ఫిల్మ్ షూట్ లో పాల్గొన్న మహేష్ ఆ షూట్ లో భాగ్నగా తీసిన పిక్స్ ను షేర్ చేశాడు. యాడ్ ఫిల్మ్ మేకర్ అవినాష్ గోవారికర్ డైరక్షన్ లో ఈ యాడ్ షూట్ జరిగినట్టు తెలుస్తుంది. అయితే తన లుక్ ను షేర్ చేసి బెస్ట్ అనేది ఎంపిక చేయడం కష్టమే కాని ఇదిగో ఇది అంటూ మహేష్ తన స్టైలిష్ లుక్ ఉన్న పిక్ ను షేర్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ లుక్ వైరల్ గా మారింది. ఇక మహేష్ వీరాభిమానులైతే ఈ పిక్ చూసి మాటల్లేవ్.. మాట్లాడుకోటాలేవ్ అనేలా ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు.