
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో క్రేజీ మూవీగా వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ మాస్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ కూడా ఒక స్పెషల్ రోల్ చేస్తుందని అనుకున్నారు. అయితే సుకుమార్ ఇచ్చిన ఆఫర్ ను అనసూయ రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.
రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో అలరించిన అనసూయ పుష్పలో కూడా అదే తరహా పాత్ర ఇచ్చేసరికి ఆమె చేయనని చెప్పేసిందట. స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటుతున్న అనసూయ వెండితెర మీద కూడా డిఫరెంట్ రోల్స్ చేస్తూ అలరిస్తుంది. పుష్ప సినిమాలో ఆఫర్ కాదని చిత్రయూనిట్ కు షాక్ ఇచ్చింది అనసూయ. ప్రస్తుతం అనసూయ కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలో ఛాన్స్ అందుకుంది.