యాహూ సెర్చ్.. టాప్ 10లో అల్లు అర్జున్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి నేషనల్ వైడ్ గా తన సత్తా చాటాడు. యాహూ సెర్చ్ ఇంజిన్ లో 2020లో వెతిక టాప్ సెలబ్రిటీస్ లో టాప్ 10లో స్థానం సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఈ ఇయర్ యాహూ సెర్చ్ ఇంజిన్ లో ఎక్కువగా వెతికిన వారిలో టాప్ 10 సెలబ్రిటీస్ లో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. కేవలం తెలుగు హీరోల్లోనే కాదు సౌత్ లో ఈ లిస్ట్ లో నిలిచిన హీరోగా అల్లు అర్జున్ క్రేజ్ డబుల్ అయ్యిందని చెప్పొచ్చు.

2020 యాహూ సెర్చింగ్ లిస్ట్ లో టాప్ 1 గా నిలిచాడు దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ఈ లాక్ డౌన్ టైం లో సుశాంత్ సూసైడ్ అందరికి షాక్ ఇచ్చింది. అతను మరణించిన తర్వాత సుశాంత్ కోసం తెగ వెతికేసినట్టు తెలుస్తుంది. ఇక యాహూ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. ఈ లిస్ట్ లో సొనూసూద్ ఎనిమిదవ స్థానంలో ఉండగా 10వ స్థానంలో అల్లు అర్జున్ ఉన్నాడు.