పుష్ప షూటింగ్ ఆగిపోయిందా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో మాస్ లుక్ తో కనిపించనున్నాడు అల్లు అర్జున్. ఫారెస్ట్ లొకేషన్స్ కోసం ఇన్నాళ్లు సర్చ్ చేసిన చిత్రయూనిట్ ఫైనల్ గా మారేడుమిల్లిలో షూటింగ్ మొదలుపెట్టింది. లాంగ్ షెడ్యూల్ కోసం అక్కడకు వెళ్లిన చిత్రయూనిట్ కు అక్కడ సమస్యలు మొదలైనట్టు తెలుస్తుంది.

సడెన్ గా పుష్ప యూనిట్ హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యిందట. పుష్ప టీం లో కరోనా కలకలం సృష్టించడం వల్ల షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి అందరు హైదరాబాద్ వచ్చేసినట్టు టాక్. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. పుష్ప సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి సినిమా లేట్ అవుతూ వచ్చింది. మరి షూటింగ్ బ్రేక్ వేసిన వార్త నిజమే అయితే షూటింగ్ కు లాంగ్ బ్రేక్ పడినట్టే.