ఖిలాడీ రవితేజకు కరెక్ట్ విలన్..!

మాస్ మహరాజ్ రవితేజ క్రాక్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపీచంద్ మలినేని డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఖిలాడి టైటిల్ తో వస్తున్న ఈ సినిమా వెయిట్ పెంచేలా స్టార్ కాస్టింగ్ ఉంది. సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నాడని తెలుస్తుంది.

వీర సినిమాతో ఫ్లాప్ అందుకున్న రమేష్, రవితేజ కాంబో ఈసారి హిట్ టార్గెట్ తో ఈ సినిమా చేస్తున్నారు. కథ కూడా బాగా రావడంతో సినిమాపై ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమాలో అర్జున్ విలనిజం కూడా ప్లస్ అవుతుందని అంటున్నారు. సినిమాలో రవితేజ సరసన అను ఇమ్మాన్యుయెల్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారని తెలుస్తుంది. 2021 దసరా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా మాస్ ఆడియెన్స్ కు జోష్ ఇస్తుందని అంటున్నారు.