ప్రభాస్ 'సలార్'.. బిగ్ ఎనౌన్స్ మెంట్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో బిగ్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో ప్రభాస్ సినిమా గురించి కొన్నాళ్లుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అయితే ఫైనల్ గా ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సలార్ అంటూ వస్తున్నారు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రాధే శ్యాం సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ సినిమా కూడా లైన్ లో ఉంది.

ఈ రెండు సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సలార్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. కె.జి.ఎఫ్ మూవీ సూపర్ హిట్ కాగా ఆ సినిమా సీక్వల్ గా వస్తున్న చాప్టర్ 2 త్వరలో రాబోతుంది. పార్ట్ 2 మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ సలార్ కె.జి.ఎఫ్ రేంజ్ లో ఉంటుందా లేక అంతకుమించి ఉంటుందా అన్నది సినిమా వస్తేనే కాని తెలుస్తుంది.