
నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కలిసి సినిమా చేస్తే ఆ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో తెలిసిందే. బాబాయ్ అబ్బాయ్ కాంబో సినిమాపై నందమూరి ఫ్యాన్స్ చాలా ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ కాంబో సినిమా డిస్కషన్స్ లో ఉన్నా సరైన కథ దొరకట్లేదని తెలుస్తుంది. అయితే బాబాయ్ సినిమాలో అబ్బాయ్ గెస్ట్ రోల్ అయితే కన్ఫాం అయినట్టు తెలుస్తుంది.
బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున బోయపాటి శ్రీను సినిమాలో కళ్యాణ్ రాం గెస్ట్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో కథను మలుపు తిప్పే పాత్రలో నందమూరి హీరో కనిపిస్తాడట. ఆల్రెడీ ఎన్.టి.ఆర్ బయోపిక్ లో కళ్యాణ్ రాం నటించాడు. మరోసారి బాబాయ్ సినిమాలో నటిస్తున్నాడు కళ్యాణ్ రాం. బోయపాటి సినిమా కాబట్టి కళ్యాణ్ రాం చేసేది చిన్న పాత్రే అయినా సూపర్ గా ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమాకు టైటిల్, హీరోయిన్స్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.