పగ తీర్చుకుంటా అంటున్న కీర్తి సురేష్..!

నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా రంగ్ దే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్ లో కీర్తి సురేష్ ఓ చిన్న కునుకు వేయగా అది ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు నితిన్. మేము కష్టపడుతుంటే కీర్తి మాత్రం హాయిగా నిద్రపోతుందని కామెంట్ పెట్టాడు. 

సోషల్ మీడియాలో కీర్తి నిద్రపోతున్న పిక్ వైరల్ అయ్యింది. అయితే దానితో కీర్తి సురేష్ ఇక మీదట షూటింగ్ స్పాట్ లో నిద్రపోకూడదనే గుణపాఠం నేర్చుకున్నానని.. అయితే పగ తీర్చుకుంటానని అన్నది కీర్తి సురేష్. నితిన్ మీద చేసిన ఈ పనికి కీర్తి సురేష్ పైకి సరదాగా స్పందించినా లోపల మాత్రం హర్ట్ అయినట్టు కనిపిస్తుంది.