
సూపర్ స్టార్ మహేష్, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ ఇద్దరు కలిసి సినిమా చేసే ఆ లెక్క వేరేలా ఉంటుంది. మహేష్, పూరీ కలిసి చేసిన పోకిరి సెన్సేషనల్ హిట్ కాగా ఆ తర్వాత ఇద్దరు కలిసి చేసిన సెకండ్ మూవీ బిజినెస్ మెన్ కూడా సూపర్ హిట్ అయ్యింది. మహేష్ తో పూరీ జగన్నాథ్ హ్యాట్రిక్ మూవీ ప్రయత్నాలు చేస్తున్నాడు. జనగణమన కథ మహేష్ కోసమే రాసి పెట్టుకున్నాడు పూరీ. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసుకున్నాడు పూరీ. కాని పూరీకి మహేష్ ఛాన్స్ ఇవ్వట్లేదు.
ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో మహేష్ కోసం హిట్ డైరక్టర్స్ కే ఛాన్స్ ఇస్తాడని పూరీ అన్నాడు. ఆ కామెంట్ ను మహేష్ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. అయితే ఈమధ్య పూరీ బర్త్ డే కి మహేష్ విష్ చేసి మ్యాటర్ క్లోజ్ చేశాడు. ఇక ఈ ఇద్దరి హ్యాట్రిక్ సినిమాకు అనీల్ సుంకర ప్రయత్నాలు చేస్తున్నారట. ఇద్దరిని కలిపి సినిమా చేయించాలని నిర్మాతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అనీల్ సుంకర ఆ బాధ్యత తీసుకుని ఇద్దరి మీటింగ్ ప్లాన్ చేస్తున్నారట. ఆ డిస్కషన్ సక్సెస్ అయితే జనగణమన మహేష్ తోనే పూరీ చేసే ఛాన్సులు ఉన్నాయని చెప్పొచ్చు.