ప్రభాస్.. ప్రశాంత్ నీల్.. క్రేజీ అప్డేట్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. ప్రస్తుతం రాధే శ్యాం సినిమా సెట్స్ మీద ఉండగా ఈ సినిమా తర్వాత ఆదిపురుష్ లైన్ లో ఉంది. ఓం రౌత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరక్షన్ లో సినిమా ప్లాన్ చేశాడు. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ చేసే సినిమాపై అందరు వెయిట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ చాప్టర్ 1తో డైరక్టర్ గా తన సత్తా ఏంటో చూపించిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం రాకీ భాయ్ తోనే కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే ప్రభాస్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రభాస్, ప్రషాంత్ నీల్ సినిమాను కె.జి.ఎఫ్ నిర్మాతలే ప్రొడ్యూస్ చేస్తున్నట్టు తెలుస్తుంది.