
యువ హీరో నాగ శౌర్య 20వ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. సంతోష్ జాగర్లముడి డైరక్షన్ లో నాగ శౌర్య చేస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా లక్ష్య టైటిల్ ఫైనల్ చేశారు. సినిమా నుండి టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నాగ శౌర్య సరసన ఈ సినిమాలో కెతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.
సినిమాకు ముందు పార్ధు, ధనుర్దారి టైటిల్స్ పరిశీలనలో ఉండగా పార్ధు టైటిల్ త్రివిక్రం దగ్గర ఉందని తెలిసి అది వద్దనుకున్నారు. ధనుర్దారి టైటిల్ ఎందుకో వద్దనుకుని ఫైనల్ గా లక్ష్యకి ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా కోసం నాగ శౌర్య ఫిక్స్ ప్యాక్ ట్రై చేశాడు. ఈ ఇయర్ మొదట్లో అశ్వద్ధామ అంటూ వచ్చి నిరాశపరచిన నాగ శౌర్య లక్ష్యతో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు.