
నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్, హీరోయిన్స్ ఎవరన్నది త్వరలో వెల్లడిస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బి.గోపాల్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని టాక్. ఈ సినిమా తర్వాత స్టార్ రైటర్ కోనా వెంకట్ రాసిన ఓ మాస్ ఎంటర్టైనర్ సినిమాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.
స్టార్ రైటర్ గా క్రేజ్ తెచ్చుకుని ఈమధ్య నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్న కోనా వెంకట్ బాలయ్య కోసం ఓ సూపర్ స్టోరీ సిద్ధం చేశాడట. ఈమధ్యనే బాలకృష్ణని కలిసి స్టోరీ లైన్ వినిపించాడట. ఆయన కూడా ఓకే చెప్పినట్టు టాక్. ఈ సినిమాను శ్రీవాస్ డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు. బోయపాటి సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.