చరణ్ తో లక్కీ ఛాన్స్ ఎవరికి..!

ఓ పక్క ఆర్.ఆర్.ఆర్, మరోపక్క ఆచార్య.. రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు మెగా పవర్ స్టార్ రాం చరణ్. ఆర్.ఆర్.ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆచార్యలో కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడు. చిరంజీవి ఆచార్య సినిమాలో చరణ్ చేసే 30 నిమిషాల రోల్ హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. కొరటాల శివ రాం చరణ్ రోల్ ను చాలా పవర్ ఫుల్ గా రాసుకున్నాడట.

ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాలో చరణ్ తో రొమాన్స్ చేసేది ఎవరన్నది ఇంకా తెలియలేదు. మొన్నటిదాకా రష్మిక, కియరా అద్వానిల పేర్లు వినపడ్డాయి. అయితే ఆచార్యలో చరణ్ తో జోడీ కట్టేది ఎవరన్నది చిత్రయూనిట్ త్వరలో ఎనౌన్స్ చేస్తుందని తెలుస్తుంది. ఆచార్య నుండి నెక్స్ట్ వచ్చే బిగ్ ఎనౌన్స్ మెంట్ అదే అని అంటున్నారు. చరణ్ పోస్టర్ తో పాటుగా సినిమాలో చరణ్ తో రొమాన్స్ చేసే హీరోయిన్ ను రివీల్ చేస్తారని టాక్.