
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన మాటలతో, తన డైరెక్షన్ తో రికార్డుల సునామీ సృష్టించగల వ్యక్తి పూరి జగన్నాధ్. పోకిరి లాంటి తెలుగు ఇండస్ట్రీ హిట్ ను అందించిన పూరి, ఇప్పుడు కల్యాణ్ రామ్ తో కలిసి మరోసారి ఇండస్ట్రీని కుమ్మేసే పనిలో పడ్డట్లు కనిపిస్తోంది. ఇజం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ లో కళ్యాణ్ రామ్ లుక్ అదిరిపోయింది. ఇప్పుడు నెట్ లో ఈ టీజర్ హల్ చల్ చేస్తోంది.
కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ తో అదరగొట్టాడు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ ఇజంలో మరోసారి పూరి మార్క్ కనిపించింది. ఇప్పటికే జనతాగ్యారేజ్ తో ఎన్టీఆర్ అదరగొడితే ఇప్పుడు ఇజంతో కళ్యాణ్ రామ్ అదరగొడతాడు అని నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ టీజర్ ను మీరు కూడా చూడండి.