నాగార్జున వైల్డ్ డాగ్ ఓటిటి రిలీజ్..?

కింగ్ నాగార్జున హీరోగా ఊపిరి సినిమా రైటర్ సోల్మన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా వైల్డ్ డాగ్. ఈమధ్యనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఓటిటి రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నాగార్జున సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు ఓకే చెప్పినట్టు టాక్.

నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా నెట్ ఫ్లిక్స్ తో డీల్ సెట్ చేసుకుంటుందని తెలుస్తుంది. అయితే థియేటర్లు ఓపెన్ అయ్యాక థియేట్రికల్ రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారట. అక్కినేని ఫ్యాన్స్ థియేటర్ లో కూడా ఈ సినిమా ఎంజాయ్ చేసేలా చూస్తున్నారట. మన్మధుడు 2 తర్వాత చాలా కథలు విన్న నాగార్జున వైల్డ్ డాగ్ తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న బంగార్రాజు సినిమా కూడా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్తుందని టాక్.