తమ్ముడు హోటల్ కు దేవరకొండ ప్రమోషన్..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు యూత్ లో ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉంది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయ్ క్రేజ్ తో తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి రెండో సినిమాతో హిట్ అందుకున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా సూపర్ హిట్ అందుకుంది.

ఈ సినిమా హిట్ అవడమే ఆలస్యం సినిమాతో వచ్చిన డబ్బుతో ఓ హోటల్ పెట్టేశాడు ఆనంద్ దేవరకొండ. అన్నలా సినిమాలు బిజినెస్ రెండిటిని బ్యాలెన్స్ చేయాలనే ఆలోచనలో ఉన్న ఆనంద్ దేవరకొండ గుడ్ వైబ్స్ ఓన్లీ హోటల్ స్టార్ట్ చేశాడు. తన స్నేహితులతో తమ్ముడు స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ కు విజయ్ దేవరకొండ ప్రమోషన్ మొదలు పెట్టాడు. శని, ఆదివారాల్లో ఈ హోటల్ కు వచ్చి ఎవరేం తిన్నా సరే ఆ బిల్లులో సగం తను ఇస్తానని చెప్పాడు. అంటే బిల్ ఎంతైనా సరే సగం అర్జున్ రెడ్డి హీరో ఖాతాలో పడుతుంది. మిగిలిన సగం కస్టమర్స్ కటాల్సి ఉంటుంది. వీకెండ్ ఆఫర్ బాగుంది కదా.. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా హిట్ అయ్యింది.. తమ్ముడి ఖాతాలో ఓ సూపర్ హిట్ పడ్డది కాబట్టి విజయ్ దేవరకొండ హ్యాపీనెస్ తో ఈ ఆఫర్ ఇచ్చాడు.