
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్, రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. సినిమాలో చిరుతో పాటు రాం చరణ్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ ను చేస్తాడని తెలుస్తుంది. ముందు ఈ సినిమాకు సాహో సుజిత్ ను డైరక్టర్ గా అనుకున్నారు. ఇక ఆ తర్వాత అతని ప్లేస్ లో వినాయక్ వచ్చి చేరాడని తెలుస్తుంది. అయితే ఏమైందో ఏమో వినాయక్ కూడా ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా లూసిఫర్ రీమేక్ గా వస్తున్న ఈ మెగా సినిమాకు తమిళ డైరక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. ధృవ మాత్రుక దర్శకుడు మోహన్ రాజా తెలుగు సినిమాలను అక్కడ రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. మరి లూసిఫర్ రీమేక్ గా మోహన్ రాజాకు అయినా ఛాన్స్ దక్కుతుందో లేదో చూడాలి.