మిడిల్ క్లాస్ హీరోయిన్ డెడికేషన్ సూపర్..!

కోలీవుడ్ లో సైడ్ హీరోయిన్ గా నటిస్తూ 96 సినిమాతో పాపులర్ అయిన నటి వర్ష బొల్లమ్మ. తెలుగులో కూడా 96 రీమేక్ గా వచ్చిన జాను సినిమాలో నటించిన వర్ష ఆ సినిమా తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటూ ఓ సినిమా చేసింది. ఈ సినిమాలో ఆమె తన పాత్రకు సొంత డబ్బింగ్ చెప్పుకుందని తెలుస్తుంది. తెలుగు రాకపోయినా సరే ఆమె నేర్చుకుని మరి డబ్బింగ్ చెప్పిందని టాక్.

వినోద్ అనంతోజు డైరక్షన్ లో వచ్చిన సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. అమేజాన్ ప్రైం లో రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. సినిమాలో పాత్ర కోసం వర్ష తెలుగు నేర్చుకుంది అంటే అమ్మడి డెడికేషన్ ను చూసి సూపర్ అనేస్తున్నారు తెలుగు ఆడియెన్స్.