
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తాడని అన్నారు కాని డేట్స్ అడ్జెస్ట్ అవ్వక విజయ్ సేతుపతి ఈ సినిమా కాదన్నాడట.
పుష్ప సినిమాలో విలన్ కోసం మాధవన్, నారా రోహిత్ విలన్ గా చేస్తారని అనుకోగా వారు కూడా చేయట్లేదని తెలుస్తుంది. లేటెస్ట్ గా ఈ సినిమాలో విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రం నటిస్తాడని తెలుస్తుంది. అయితే తమిళంలో స్టార్ హీరో విక్రం తెలుగు స్టార్ హీరోకి విలన్ గా చేసే ఛాన్స్ లేదని కొందరు అంటున్నాడు. విలక్షణ నటుడు కాబట్టి పాత్ర నచ్చితే విక్రం విలన్ గా నటిస్తాడని అంటున్నారు. పుష్పలో చియాన్ విక్రం ఉంటాడన్న వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో త్వరలో తెలుస్తుంది.