
ప్రతిరోజూ పండుగే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మారుతి తన నెక్స్ట్ సినిమాను మాస్ మహరాజ్ రవితేజ హీరోగా చేస్తాడని తెలుస్తుంది. ఈరోజుల్లో సినిమాతో డైరక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన మారుతి ప్రస్తుతం తెలుగులో ఉన్న మినిమం గ్యారెంటీ డైరక్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. రవితేజ కూడా ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరక్షన్ లో క్రాక్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఖిలాడితో పాటుగా మారుతి డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. మారుతి, రవితేజ ఈ కాంబోలో అదిరిపోయే కామెడీ స్టోరీ సిద్ధం చేశాడట మారుతి. మారుతి మార్క్ ఎంటర్టైనింగ్ తో పాటుగా రవితేజ మార్క్ యాక్షన్ ఎంటర్టైనింగ్ గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.