
యంగ్ రెబల్ స్టార్ హీరోగా ఓం రౌత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. సైఫ్ ఆలి ఖాన్ గా రావణుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సీత పాత్రలో ఎవరు నటిస్తారన్నది ఇంకా నిర్ణయించలేదు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్రయూనిట్.
2022న ఆగష్టు 11న ఆదిపురుష్ రిలీజ్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ డైరక్షన్ లో రాధే శ్యాం సినిమా చేస్తున్నాడు. ప్రభాస్, పూజా హెగ్దే జంటగా నటిస్తున్న ఈ సినిమా 2021 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమా తర్వాత అసలైతే నాగ్ అశ్విన్ సినిమా చేయాల్సి ఉన్నా ఆదిపురుష్ ముందుకు రావడంతో ఆ సినిమాను వెనక్కి నెట్టాల్సి వచ్చింది.