సూర్య సినిమాకు విజయ్ దేవరకొండ ప్రశంసలు..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ సూర్య నటించిన సొరరై పోట్రు సినిమాపై ప్రశంసలు కురిపించారు. రీసెంట్ గా అమేజాన్ ప్రైం లో రిలీజైన ఈ సినిమా తెలుగు వర్షన్ ఆకాశం నీ హద్దుర టైటిల్ తో అందుబాటులో ఉంది. అమేజాన్ లో రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాగా సూర్య ఆకాశం నీ హద్దురా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.   

ఈ సినిమా చూసిన విజయ్ దేవరకొండ చిత్రయూనిట్ ను మెచ్చుకున్నారు. తానో పెద్ద గ్యాంగ్ తో ఈ సినిమా చూశానని.. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యానని అన్నారు విజయ్ దేవరకొండ. సినిమా చూసిన తర్వాత తెలియని ఆవేశం కలిగిందని.. మంచి సందేశాన్ని ఇచ్చింది.. సూర్య అన్న అద్భుతమైన నటన కనబరిచారు. ఈ సినిమాలో ఆయన నటన చూసి ఆయన మీద మరింత ఇష్టం పెరిగిందని అన్నారు విజయ్ దేవరకొండ. హీరోయిన్ అపర్ణ బాలమురళిని చూసి ఇలాంటి అద్భుతమైన నటిని సుధ గారు ఎక్కడ పట్టారని అనిపించిందని.. డైరక్టర్ సుధ కొంగరని అభినందిస్తూ మీతో త్వరలోనే ఓ సినిమా చేస్తానని అన్నారు విజయ్ దేవరకొండ.