చిరుత కాంబో రిపీట్ అవుతుందా..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ తెరంగేట్రం చేసిన సినిమా చిరుత. పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు రాం చరణ్. ఇక ఆ తర్వాత కెరియర్ లో ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు కొడుతూ మెగాస్టార్ కు తగ్గ తనయుడిగా పేరు తెచుకున్నాడు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న రాం చరణ్ తన నెక్స్ట్ సినిమా చర్చల్లో ఉన్నాడు. 

ఇక లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం రాం చరణ్ మరోసారి పూరీ డైరక్షన్ లో సినిమా చేస్తాడని అంటున్నారు. పూరీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చరణ్ మరోసారి ఆయన డైరక్షన్ లో సినిమాకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. ప్రస్తుతం పూరీ విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత రాం చరణ్ సినిమా ఉంటుందని టాక్. చిరుత కాంబో రిపీట్ అయితే మెగా ఫ్యాన్స్ కు పండుగ అన్నట్టే.